60 ఏళ్ళ వయసు పాత్రలో నితిన్..?

January 25, 2021


img

అదేంటి యువ హీరో నితిన్ కు అప్పుడే అరవై ఏళ్లు ఎలా అని ఆశ్చర్యపోవచ్చు. లాస్ట్ ఇయర్ భీష్మతో హిట్ అందుకున్న నితిన్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో రెండు సినిమాలు నెల గ్యాప్ లో రిలీజ్ అవబోతున్నాయి. నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తున్న చెక్ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ ఫిక్స్ చేయగా.. వెంకీ అట్లూరి డైరక్షన్ లో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా మార్చ్ 26న రిలీజ్ ప్లాన్ చేశారు. 

ఈ రెండు సినిమాలే కాకుండా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో నితిన్ నటిస్తున్నాడు. ఇదేకాకుండా కృష్ణ చైతన్య డైరక్షన్ లో పవర్ పేట సినిమా చేస్తున్నాడు. పవర్ పేట సినిమాలో నితిన్ 60 ఏళ్ల వయసు గల వ్యక్తిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. పవర్ పేట సినిమాలో నితిన్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడట. అయితే అందులో ఓల్డ్ గెటప్ లో ఒక పాత్ర ఉంటుందట. ఈమధ్యనే నితిన్ 60 ఏళ్ల వ్యక్తిగా లుక్ టెస్ట్ చేయగా బాగా వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా నితిన్ కూడా కొత్త ప్రయోగాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష