సైలెంట్ గా స్టార్ట్ చేసిన మహేష్..!

January 25, 2021


img

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా సకారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ సెటైర్, బ్యాంక్ సెక్టార్ లోని లోపాలని వేలెత్తి చూపేలా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో మొదలుపెట్టారు. అందుకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఆక్షన్ కు యాక్షన్ షురూ అయ్యిందని ట్విట్టర్ లో మహేష్ టీం ప్రకటించింది.

సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత తను తీస్తే స్టార్ హీరోతోనే సినిమా తీయాలని అనుకున్న పరశురాం ఫైనల్ గా మహేష్ తో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. దుబాయ్ లో పాటతో సినిమా మొదలు అయ్యిందని తెలుస్తుంది. సినిమాను త్వరగా పూర్తి చేసి దసరా బరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష