బోయపాటి శ్రీనుతో సూర్య..?

January 24, 2021


img

టాలీవుడ్ యాక్షన్ మాస్ డైరక్టర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే.. తను తీసే సినిమాలతో ఆ హీరోల ఇమేజ్ పూర్తిగా మార్చేస్తాడు ఈ డైరక్టర్. ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణతో బిబి3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా ఉంటుందని అంటున్నారు. 

ప్రభాస్ కోసం బోయపాటి శ్రీను ఓ మాస్ స్టోరీ రాసుకున్నాడట. అయితే ప్రభాస్ ఇప్పుడు వరుస క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రభాస్ తో చేయాలనుకున్న కథతో సూర్యతో ఫిక్స్ చేసుకున్నాడట బోయపాటి శ్రీను. కోలీవుడ్ హీరో సూర్య తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. సూర్య చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వచ్చాయి. ఈమధ్యనే వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమా కూడా హిట్ అయ్యింది. ఎన్నాళ్ల నుండో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్న సూర్య ఫైనల్ గా బోయపాటితో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష