శర్వానంద్ శ్రీకారం రిలీజ్ ఎప్పుడంటే..!

January 24, 2021


img

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ మూవీ శ్రీకారం. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సినిమా నుంచి విడుదలైన భలేగుంది బాలా, సందల్లె సందల్లె సంక్రాంతి సందల్లె అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న శ్రీ‌కారం ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు శ‌నివారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గ‌ళ్ల లుంగీ.. కాట‌న్ ష‌ర్ట్.. న‌వ్వుతూ వున్న శ‌ర్వానంద్ లుక్ ఇంప్రెస్ చేస్తుంది. ఈ మూవీ లో శర్వా రైతు గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా కు జోడిగా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఆరెక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ తో పాటు బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష