రిలీజ్ డేట్ కు 'చెక్' పెట్టిన నితిన్

January 23, 2021


img

భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో చెక్ కూడా ఒకటి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

ఫిబ్రవరి 19న నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్. సినిమా నుండి రిలీజైన టీజర్ ప్రేక్షకులను అలరించింది. చెస్ చాంపియన్, ఉగ్రవాది రెండిటితో టీజర్ తోనే సినిమాపై బజ్ ఏర్పరిచారు డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమాను మార్చ్ 26న రిలీజ్ ప్లాన్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష