శంకర్ తో కె.జి.ఎఫ్ యశ్ మూవీ..!

January 21, 2021


img

కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం చాప్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత యశ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ తో కె.జి.ఎఫ్ యశ్ సినిమా ఉంటుందని టాక్. హిస్టారికల్ స్టోరీతో ఈ సినిమా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌత్ స్టార్ డైరక్టర్స్ లో టాప్ 1,2,3లలో ఒకరైన శంకర్ ఈసారి యశ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాకు ఒక ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే సినిమాను 2022లో మొదలు పెట్టి 2024లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం శంకర్ కమల్ హీరోగా ఇండియన్ 2 సినిమాను చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇండియన్ 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి శంకర్ తో యశ్ సినిమా కె.జి.ఎఫ్ ను మించి ఉంటుందా లేదా అన్నది చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష