రాధే శ్యామ్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు..!

January 21, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

సినిమాలో కృష్ణం రాజు పరమహంస పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇద్దరు రెబల్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. ప్రభాస్, కృష్ణం రాజు కలిసి రెబల్ సినిమాలో నటించారు అయితే ఆ సినిమా ఆశించిన అందాలను అందుకోలేదు. ఫైనల్ గా రాధే శ్యాం లో మరోసారి ఈ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ ను అలరించనున్నారు. రాధే శ్యామ్ లో రెబల్ స్టార్ నటిస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు.    Related Post

సినిమా స‌మీక్ష