అన్నపూర్ణ స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్.. స్పందించిన నాగార్జున..!

October 16, 2020


img

సోషల్ మీడియా వచ్చాక వార్తలు ఎంత స్పీడ్ గా ప్రజల దగ్గరకు వెళ్తున్నాయో అదే విధంగా ఫేక్ న్యూస్ లు కూడా అదేలా ఇబ్బందులు కలుగచేస్తున్నాయి. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సిబ్బంది అలాంటిదేమి లేదని చెప్పారు. అయినా ఈ వార్తలు ఆగలేదు ఫైనల్ గా కింగ్ నాగార్జున ట్విట్టర్ లో స్పందించాల్సి వచ్చింది. 

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైర్ యాక్సిడెంట్ అన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు నాగార్జున. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మకండని అన్నారు నాగ్. ఇక్కడ అంతా బాగానే ఉందని అన్నారు నాగార్జున. కింగ్ ట్వీట్ చూసిన తర్వాత ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ కూడా వేసి ఉంది. ఫైర్ యాక్సిడెంట్ అని తెలియడంతో బిగ్ బాస్ హౌజ్ ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని డౌట్ పడ్డారు. అయితే అసలు తమ స్టూడియోలో అలాంటిదేమి జరగలేదని క్లారిటీ ఇవ్వడంతో అందరు హమ్మయ్య అనుకున్నారు. 

Related Post

సినిమా స‌మీక్ష