చిత్రం 2 ప్లానింగ్ లో తేజా..!

August 01, 2020


img

తెలుగులో ఒకప్పుడు ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన తేజ ఈమధ్య తన పంథా మార్చుకుని సినిమాలు చేస్తున్నాడు. హిట్టు కోసం హోరాహోరీగా ప్రయత్నిచిన ఈ డైరక్టర్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత సీత సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఈమధ్యనే ఒకేసారి రెండు సినిమాలు ఎనౌన్స్ చేశాడు తేజ.

అందులో ఒకటి రానాతో కాగా.. మరొకటి గోపిచంద్ తో చేస్తాడని తెలుస్తుంది. ఇదే కాకుండా తేజా డైరక్షన్ లో తన మొదటి సినిమా చిత్రం సీక్వల్ గా ఓ కథ రాబోతుందని అంటున్నారు. 20 ఏళ్ళ క్రితమే ఎర్లీ మ్యారేజ్, యంగ్ కపుల్స్ మద్య డిస్టబన్స్ ల గురించి చిత్రం సినిమాలో చూపించాడు  తేజ. ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 

ఇక మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటున్న తేజ ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేశారు. ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న నందిని రాయ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటి ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడట తేజ.   Related Post

సినిమా స‌మీక్ష