భీష్మ : రివ్యూ

February 21, 2020


img

లవర్ బోయ్ నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సమీక్ష చూద్దాం.

కథ :

కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని హీరో భీష్మ (నితిన్). తన దారిన తను వెళ్తుంటే ఓ రోజు సడెన్ గా పరిచయమవుతుంది చైత్ర (రష్మిక). ఆమె ముందు ఏ.సి.పి అని బిల్డప్ ఇచ్చి తర్వాత ఆమె ఆ ఏ.సి.పి కూతురని తెలుసుకుని చిన్నబోతాడు. ఫైనల్ గా ఇలా ఓ పక్క ఇది నడుస్తుంటే. సేంద్రీయ వ్యవహాసం కోసం పాటుపడే భీష్మా ఆర్గానిక్స్ అధినేత భీష్మ తన తర్వాత తన సంస్థ చూసుకునేందుకు ఒకరిని వెతుకుతాడు. ఇలా చూస్తున్న అతనికి జూనియర్ భీష్మ కరెక్ట్ పర్సన్ అని అనిపిస్తుంది. అందుకే అతన్ని సి.ఈ.ఓగా చేస్తాడు. హీరోయిన్ మాత్రం హీరో ఇదంతా తన కోసమే చేస్తున్నాడని అనుకుంటుంది.. ఇంతకీ జూనియర్ భీష్మ భీష్మా ఆర్గానిక్స్ కు సి.ఈ.ఓ ఎలా అయ్యాడు..? సి.ఈ.ఓ భీష్మ అక్కడ ఉన్న సమస్యలను ఎలా తీర్చాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల తన సెకండ్ సినిమాను అదే విధంగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కథ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోని వెంకీ కథనం మాత్రం చాలా తెలివిగా నడిపించాడు. ఈ సినిమాకు హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. నితిన్, రష్మిక ఇద్దరు సూపర్ ఎంటర్టైన్ చేశారు.

సినిమాలో సేంద్రీయ వ్యవసాయం గురించి మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు వెంకీ. కొద్దిగా కొరటాల శివ, అక్కడక్కడ త్రివిక్రం ఇలా ఇద్దరి దర్శకులను కవర్ చేసిన వెంకీ భీష్మతో మరో ఎంటర్టైన్ మూవీని అందించాడు. సినిమాలో నితిన్ కూడా చాలా ఈజ్ తో నటించాడు. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు మెచ్చేలా ఈ సినిమా ఉంది.  

కథ రొటీన్ గా అనిపించినా స్క్రీన్ ప్లేతో మెప్పించాడు. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా సాగిపోతుంది. నితిన్ తో పాటుగా వెంకీ కుడుములకు ఈ సినిమా మంచి హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

భీష్మగా నితిన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నితిన్ లుక్, డ్యాన్స్ అన్ని మెప్పించాయి. రష్మిక కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ కూడా సినిమాలో బాగున్నాయి. ముఖ్యంగా నితిన్, రష్మిక పెయిర్ చూడముచ్చటగా ఉంది. సినిమాలో విలన్ గా నటించిన జిస్సు సేన్ గుప్తా జస్ట్ ఓకే అనిపించాడు. అయితే అతనికి ఎక్కువ స్కోప్ లేదని చెప్పొచ్చు. అనంత్ నాగ్, సంపత్, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిశోర్, రఘు బాబు అలరించారు.

ఇక భీష్మ టెక్నికల్ టీం విషయానికొస్తే.. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాలో రెండు సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి. బిజిఎం అలరించింది. ఇక సినిమా కథ రొటీన్ గా ఉన్నా కథనంలో తన కామెడీ ఎంటర్టైనింగ్ తో మెప్పించాడు వెంకీ కుడుముల. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

నితిన్ భీష్మ.. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3/5 Related Post

సినిమా స‌మీక్ష