గోదావరి నదిలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా టిజిఎస్ ఆర్టీసీ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో 15 పట్టణాల నుంచి గోదావరి ఒడ్డున గల కాళేశ్వరంకు ప్రత్యేక బస్సులు నడుపబోతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్, ఉప్పల్, పరకాల, భూపాలపల్లి, కరీంనగర్, జనగామ, మంధని, తొర్రూర్, మహబూబ్ నగర్, నర్సంపేట, హనుమకొండ, మంచిర్యాల, గోదావరి ఖని నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపబోతున్నట్లు టిజిఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
పూర్తి వివరాలు, ముందస్తు రిజర్వేషన్స్ కోసం టిజిఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tgsrtcbus.in సందర్శించవచ్చు.