అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభోత్సవం

May 11, 2025
img

రాష్ట్రంలో తొలిసారిగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్‌, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఓ పక్క భారత్‌-పాక్‌ యుద్ధం కొనగుతున్నప్పటికీ, 110 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్‌ వచ్చి ఈ పోటీలలో పాల్గొంటుండటం విశేషం. 

సిఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందెశ్రీ వ్రాసిన తెలంగాణ రాష్ట్ర గేయం ‘జయజయహే..’ని 50 మంది గాయకులు కలిసి ఆలపించారు. ఆ తర్వాత ఖండాలవారీగా ఆయా దేశాల అందాల భామలు తమ జాతీయ జండాలు పట్టుకొని స్టేడియంలోని వస్తుంటే, ఒక్కో బృందానికి ఒక్కో బృందం తెలంగాణ కళాకారులు సాంప్రదాయ బద్దంగా వారికి ఆహ్వానం పలుకుతూ కళా ప్రదర్శనలు చేశారు.

ఈ వేడుకలలో 250 మంది నర్తకీమణులు కలిసి అత్యంత పురాతనమైన, అత్యంత క్లిష్టమైన పేరిణి నృత్యం చేసి అందరినీ మెప్పించారు. ఈ వేడుకలలో భారత్‌  ప్రతినిధిగానందిని గుప్తా సాంప్రదాయ దుస్తులు ధరించి జాతీయ జండా పట్టుకొని వస్తుంటే అందరూ హర్షధ్వానాలతో స్టేడియం మారుమ్రోగిపోయింది. 

మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభమయ్యేసరికి భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ప్రకటించడం యాదృచ్ఛికమే అయినప్పటికీ, ఈ పోటీల నిర్ణవహనపై విమర్శిస్తున్నవారి నోళ్ళు మూతపడేలా చేసింది. 


Related Post