అయోధ్య రామ మందిరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ అయోధ్య జిల్లా కలెక్టర్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన అయోధ్య రామ మందిరానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అయోధ్య రామ మందిరం చుట్టూ ఇప్పటికే చాలా భారీ భద్రత ఉంది. ఆలయం పరిసర ప్రాంతాలలో వందల సీసీ కెమెరాలున్నాయి.
అయోధ్య రామ మందిరానికి ఇటువంటి ప్రమాదం పొంచి ఉన్నందున నగరంలో అనుమానాస్పదమైన వ్యక్తుల కదలికలు గుర్తించేందుకు, రైల్వే స్టేషన్, బస్టాండ్, విమానాశ్రయంలో అనేక సిసి కెమెరాలు, మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ 10-12 అడుగుల ఎత్తైన గోడ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
తాజా బెదిరింపుపై యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా తమిళనాడు నుంచి ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు గుర్తించారు.