కొండగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు

April 13, 2025
img

శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు దేవాలయంలో హనుమాన్ స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు సెలవులు కూడా కలిసి రావడంతో భారీ సంఖ్యలో భక్తులు కొండగట్టుకి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

నేటితో హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగియబోతున్నందున హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులతో కొండగట్టు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. 

మూడు రోజులు సెలవులు, హనుమాన్ జయంతి కలిసి రావడంతో భద్రాచలంతో సహా రాష్ట్రంలో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Related Post