మెట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

April 12, 2025
img

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మండలంలోని కొండ్రికార్ల గ్రామ శివారులో గల మహాలక్ష్మీ రైస్ మిల్లులో శనివారం మద్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే ఈ అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీలో యంత్రాలతో పాటు, ఇతర సామాగ్రి, సుమారు 5,000 క్వింటాళ్ళ ధాన్యం, 85,000 గోనె సంచులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ.2 కోట్లు వరకు ఆస్తి నష్టం జరిగిననట్లు రైస్ మిల్లు యజమాని గంగారెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడమే అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Related Post