స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కొందరు మోసగాళ్ళు తమ బ్యాంకులో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నామంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, తక్కువ సమయంలో ఎక్కువ రాబడినిచ్చే పెట్టుబడులను ఎంచుకోవడంలో సహాయపడతామని డీప్ ఫేక్ వీడియోలు పెడుతున్నారని, అటువంటి వీడియోలను నమ్మి మోసపోవద్దని ఎస్‌బీఐ తన ఖాతాదారులను హెచ్చరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా తమ ఉన్నతాధికారులు ఎవరూ ఎన్నడూ ఇటువంటి వీడియో సందేశాలు పెట్టరని, ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించారని స్పష్టం చేసింది. కనుక వినియోగదారులు ఇటువంటి వీడియోలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో ఓ ప్రకటన జారీ చేసింది.
ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో బ్యాంక్ అధికారులు, పోలీసులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరివైనా నకిలీ వీడియోలు సృష్టించి నిజంగా వారే మాట్లాడుతున్నారని నమ్మేలా చేసి సామాన్య ప్రజలను మోసగాళ్ళు భయపెట్టి, ఆందోళనకు గురిచేసి డబ్బులు దోచుకుంటున్నారు. కనుక డబ్బు, ప్రమాదం, అరెస్టులు, పోలీస్ కేసులు అంటూ ఎవరూ ఫోన్ లేదా వీడియో సందేశాలు పంపినా పట్టించుకోవద్దు. ఆందోళన చెంది వారికి డబ్బు ముట్టజెప్పి మోసపోవద్దు.
ALERT - PUBLIC CAUTION NOTICE pic.twitter.com/iIpTusWCKH