భద్రాచలం పట్టణం పోతులవారి వీధిలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఆ సమయంలో లోపల పనిచేసుకుంటున్న తాపీ మేస్త్రి పడిశాల ఉపేందర్, అతనితో పనిచేస్తున్న కార్మికుడు చల్లా కామేశ్వర రావు ఇద్దరూ ఆ శిధిలాల కింద నలిగి చనిపోయారు.
గురువారం మద్యాహ్నం కామేశ్వర రావుని అతికష్టం మీద బయటకు తీసి ఏరియా ఆస్పత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ మరణించాడు.
సింగరేణి, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిధిలాలు తొలగిస్తూ గురువారం అర్ధరాత్రి తాపీ మేస్త్రి పడిశాల ఉపేందర్ మృతదేహం వెలికి తీశారు.
శిధిలాల క్రింద మరెవరైనా చిక్కుకొని ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా 5 భారీ కాంక్రీట్ స్లాబులు ఒకదానిపై మరొకటి పడినందున బ్రతికి ఉండే అవకాశాలు చాలా తక్కువే. ప్రస్తుతం శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది.