భద్రాచలంలో భవనం కూలింది... శిధిలాలలో ఒకరు

March 27, 2025
img

భద్రాచలం పట్టణంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం నిన్న మద్యాహ్నం 2.30 గంటలకు హటాత్తుగా కూలిపోయింది. దానిలో పనిచేస్తున్న కామేశ్వర రావు అనే మేస్త్రి చనిపోగా మరో ఇద్దరు మేస్త్రీలు శిధిలాల కింద చిక్కుకుపోయారు. 

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ హుటాహుటిన సహాయ సిబ్బందిని వెంటబెట్టుకొని అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. జేసీబీతో శిధిలాలను తొలగించి లోపల చిక్కుకున్నవారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా మొదటి అంతస్తులో కొన్ని పిల్లర్లు కూలిపోయాయి. దాంతో ఒకేసారి 5 అంతస్తుల స్లాబులు ఒకదానిపై మరొకటి కూలిపోవడంతో అందరూ నిర్ఘాంతపోయారు.

ఆ శిధిలాల కింద చిక్కుకున్న ఇద్దరిలో ఒకరు చనిపోయిన్నట్లు సమాచారం. మరో వ్యక్తిని కాపాడేందుకు హైడ్రాలిక్ జాకీలను తెప్పించి పడిపోయిన స్లాబు కింద అమర్చి స్లాబుని కొద్దిగా పైకి లేపి అతనికి ఆక్సిజన్ అందిస్తూ బయటకు తెచ్చేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

Related Post