హుజూర్ నగర్‌లో యువతిపై పెట్రోల్ పోసిన లవర్

February 12, 2025
img

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని ఎన్జీవోస్‌ కాలనీలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం మద్యాహ్నం 2.30 గంటలకు బురకాలు ధరించిన ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు.

ఆ యువకుడు చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని వారిలో ఓ యువతితో ఏదో మాట్లాడుతూ బాటిల్లో నుంచి కొంత పెట్రోల్ తన ఒంటిపై పోసుకొని ఆమెపై కూడా పోశాడు. దాంతో ఆమె భయపడి దూరంగా జరిగింది.

అదే సమయానికి అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు ఏదో ప్రమాదం జరుగబోతోందని పసిగట్టి వెంటనే ఆ యువకుడి చేతిలో పెట్రోల్ బాటిల్ లాక్కొని నాలుగు తగిలించి అక్కడి నుంచి పంపించి వేశారు. లేకుంటే ఆవేశంతో అతను నిప్పు పెడితే ఇద్దరూ నడిరోడ్డుపైనే సజీవ దహనం అయిపోయేవారు.

ఈ ఘటన అక్కడ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.

ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించిన యువకుడు

సూర్యాపేట జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే నిలబడి ఉన్న ఓ యువతిపై పెట్రోల్ పోసిన యువకుడు

ముందుగా తాను పెట్రోల్ పోసుకొని.. తర్వాత యువతిపై పెట్రోల్ పోసి బెదిరించిన యువకుడు

గమనించి… pic.twitter.com/Bu3KRJAGvj
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025

Related Post