ఉత్తర ప్రదేశ్ రాజధాని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళకి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రైళ్ళు, విమానాలు, బస్సులు, సొంత కార్లలో వెళ్ళివస్తున్నారు. ఆవిదంగా పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన కొందరు మినీ బస్సులో వెళ్ళి తిరిగివస్తుండగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.
వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జబల్‌పూర్‌లో సిహోరా అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఓ సరుకు రవాణా ట్రక్ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ట్రక్కు రాంగ్ రూట్‌లో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి కాపాదారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అంబులెన్సులలో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే కానీ వారి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.