అందుకే ఈ విషయం బయటకు చెప్తున్నా: మంచు విష్ణు

January 14, 2025
img

మంచు కుటుంబంలో చెలరేగిన మంచు తుఫాను మెల్లగా చల్లబడిన్నట్లే ఉంది. మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నుంచి బయటపడగలిగితే చాలు ప్రస్తుతానికి సమస్యలన్నీ తీరిన్నట్లే.

ఈ గొడవల కారణంగా ఇటీవల వార్తలలో ఎక్కువగా కనిపించిన మంచు విష్ణు తిరుపతిలో ఇటీవల తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టెడ వద్ద గల మాతృశ్య అనాధ శరణాలయంలో ఉంటున్న 120 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్నారు. వారందరినీ మోహన్ బాబు యూనివర్సిటీకి తీసుకువచ్చి అక్కడ విద్యార్ధులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. 

ఇక నుంచి వారందరికీ విద్య, వైద్యంతో సహా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మంచు విష్ణు చెప్పారు. కుడిచేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదని పెద్దలు అంటారని, కానీ ఇటువంటి విషయాలు నలుగురికీ తెలిసేలా చెప్తే ఈ స్పూర్తితో మరికొందరు ముందుకు వచ్చి సాయపడతారని భావించి చెపుతున్నానని మంచు విష్ణు అన్నారు.

మాతృశ్య అనాధ శరణాలయంకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా తాను యాధాశక్తిన సహాయసహకారాలు అందిస్తానని మంచు విష్ణు చెప్పారు. 

(Video Courtecy: News18 Telugu) 

Related Post