అల్లు అర్జున్ సమస్యలన్నీ తీర్చేసి ఆయనని ఒడ్డున పడేసిన నిర్మాత ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు మాత్రం కొత్త సమస్యలో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన సొంత ఊరు నిజామాబాద్‌లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన ‘మటన్ పీసు, తెల్లకల్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
“మన దగ్గర ఇలాంటి ఈవెంట్స్‌కి పెద్దగా ఆదరణ లభించదు. ఇదివరకు ‘ఫిదా’ ఈవెంట్ పెట్టిననప్పుడు ఇలాగే జరిగింది. మనకి మటన్, తెల్లకల్లుపైనే ఎక్కువ మక్కువ,” అని అన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన దిల్‌రాజుని ఆ పదవిలో నుంచి తొలగించాలని, ఆయన సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఈయడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
వాటిపై దిల్‌రాజు స్పందిస్తూ, “తెలంగాణవాసిగా నేను మన తెలంగాణ ప్రజల మనోభావాలను, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తానే తప్ప దెబ్బ తీయాలని ఎన్నడూ అనుకోను. బలగం సినిమా ఇందుకు నిదర్శనం.
ప్రస్తుతం విడుదలవుతున్న నా రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత మటన్, తెల్లకల్లుతో దావత్ (విందు) చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఆవిదంగా అన్నాను తప్ప ఎవరిని కించపరచాలని కాదు. అయినప్పటికీ నా మాటల వలన ఎవరయినా బాధ పడితే నన్ను క్షమించమని కోరుతున్నాను,” అని అన్నారు.