ప్రముఖ నటుడు మోహన్ బాబు బుధవారం తమ యూనివర్సిటీలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు, మీడియా ప్రతినిధులు కన్నప్ప సినిమా గురించి అడిగారు.
వారికి సమాధానం చెపుతూ, “మా అబ్బాయి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీని కోసం ముందు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువే ఖర్చు చేస్తున్నాము. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. నేను శివ భక్తుడిని. ఆ శివుడి దయతో నేను పుట్టానని నా తల్లి తండ్రులు నాకు భక్త వత్సలం అని పేరు పెట్టారు. శ్రీకాళహస్తీశ్వరుడి గురించి తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఆయన దయతో కన్నప్ప కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మా సినిమాని ప్రేక్షకులు తప్పక ఆదరస్తారని ఆశిస్తున్నాను.
"నిన్న జరిగింది మరిచిపోను. నేడు చేయాల్సిన పనిని వాయిదా వేయను. రేపటి గురించి ఆలోచించను... " అంటూ రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో డైలాగ్ చెప్పారు. కానీ ఇప్పుడు గతం గతః అని నిన్న జరిగింది మరిచిపోయి నేడు ఏం చేయాలి? రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచిస్తాను,” అని మోహన్ బాబు చెప్పారు.