మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్

December 11, 2024
img

ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవల నేపధ్యంలో ఆయన కుమారుడు మంచు మనోజ్ రెండు రోజుల క్రితం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈరోజు మోహన్ బాబు మేనేజర్ కిరణ్, మంచు విష్ణు ప్రధాన అనుచరుడు విజయ్ కుమార్‌లని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

వారిరువురూ తనపై దాడి చేసి గాయపరిచారని మంచు మనోజ్ పిర్యాదు చేశారు. జల్పల్లిలో మోహన్ బాబు నివాసంలో ఉన్న సీసీ కెమెరాలను, వాటి రికార్డింగులను మంచు విష్ణు అనుచరుడు వినయ్ రెడ్డి మాయం చేశారని మంచు మనోజ్ పిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి  వెళ్ళిపోయాడు. వినయ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

మంచు మనోజ్ ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, “మా మద్య మనస్పర్ధలు ఏర్పడినమాట వాస్తవం. కానీ ఈ గొడవలలోకి అనవసరంగా నా భార్య పిల్లలను లాగడం దేనికి?

కొందరు అబద్దాలు చెపుతూ పనిగట్టుకొని మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. అయినా కూడా నేను వారితో కూర్చొని మాట్లాడేందుకు ఇప్పటికీ సిద్దంగానే ఉన్నాను. నాన్నగారు, విష్ణు కూడా మాట్లాడేందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు రాచకొండ సీపీగారిని కలిసి మా కుటుంబలో జరిగిన గొడవలు, కారణాలు, తదనంతర పరిణామాల గురించి వివరించాను,” అని అన్నారు.

Related Post