రోమ్ నగరం మంటల్లో తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నారట. అలాగే మోహన్ బాబు కుటుంబంలో గొడవలు పతాకస్థాయికి చేరుకొని అందరూ తీవ్ర ఆందోళన చెందుతుంటే, ముంబైలో ఉన్న మంచు లక్ష్మి మాత్రం ‘శాంతి’ అంటూ చక్కటి ఫ్లూట్ గానం నేపధ్యంలో కూతురు వీడియో పోస్ట్ చేశారు.
దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో తల్లి తండ్రులకు అండగా నిలబడవలసి ఉండగా, కూతురుని ప్రమోషన్ వీడియో పెట్టడం ఏమిటని అభిమానులే ప్రశ్నిస్తున్నారు. మంచు లక్ష్మికి కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలు తెలియవనుకోవడానికి లేదు. ఈ గొడవలు మొదలైన తర్వాతే ఆమె హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్ళిపోయారు.
కానీ ఆమె కూడా తండ్రి, సోదరుల్లాగే ఆవేశపరురాలు. కనుక ఆమె కూడా ఇక్కడ ఉంటే గొడవలు మరింత పెరగవచ్చని, అందుకే తండ్రి సూచన మేరకు ఆమె ముంబయి వెళ్ళిపోయి ఉండవచ్చని శ్రేయోభిలాషులు చెపుతున్నారు.
ఆమె తల్లి తండ్రులకు అండగా నిలబడకపోయినా పరవాలేదు కానీ కూతురు ప్రమో వీడియో పెట్టేందుకు ఇదా సమయం? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి మంచు లక్ష్మి ఏం చెపుతారో?