హైదరాబాద్‌లో కన్నడ నటి శోభిత ఆత్మహత్య

December 01, 2024
img

కన్నడ టీవీ నటి శోభిత ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాదే ఆమె సుధీర్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో సీ-బ్లాకులో నివాసం ఉంటున్నారు. 

ఆమె బ్రహ్మగంతు కన్నడ సీరియాల్లో విలన్ పాత్ర చేసి ప్రేక్షకులను చాలా మెప్పించారు. మంగళగౌరి, కృష్ణ రుక్మిణీ, దీపపు నిందే గుడ్గియ నిందే, చీదపాట, కోగిలె, నినిదిలే, అమ్మవారు వంటి పాపులర్ కన్నడ సీరియల్స్, రెండు మూడు కన్నడ సినిమాలలో నటించారు. 

శనివారం అర్దరాత్రి ఆమె తన ఇంట్లో ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఆమె మృతికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఆమె పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బహుశః భార్యభర్తల మద్య ఇదే విషయమై మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.   పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె భర్తని ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించబోతున్నట్లు సమాచారం. 

Related Post