కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నేడు మోకిలా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించినందుకు పోలీసులు ఆయనపై ఎన్‌డీపీఎస్ యాక్ట్, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేశారు.
కానీ ఆ కేసులో తనని అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు కూడా. బుధవారంలోగా న్యాయవాదిని వెంటబెట్టుకొని పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు కోర్టు గడువు ఇచ్చింది. కనుక నేడు లాయర్‌ని వెంటబెట్టుకొని పోలీస్ విచారణకి హాజరుకాబోతున్నారు.
ఈరోజు పోలీసులు విచారణలో ఎలాగూ ఆయన తాను రేవ్‌పార్టీ ఇవ్వలేదని ‘దావత్’ మాత్రమే ఇచ్చానని వాదించడం ఖాయం. కనుక హైకోర్టు సూచించిన్నట్లు పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు నోటీస్ చేతిలో పెట్టి పంపించవచ్చు. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.