కేటీఆర్‌ బావమరిది ఇంట్లో రేవ్‌ పార్టీ!

October 27, 2024
img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ పక్క పరువు నష్టం దవాలు వేస్తుంటే, మరోపక్క ఆయన బావమరిది రాజ్‌ పాకాల తన ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ ఇస్తుండటం విశేషం. 

నగర శివారులో జన్వాడ వద్ద గల ఆయన ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి రేవ్‌పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కలిసి దాడి చేశారు. లో ఖరీదైన విదేశీ మద్యంతో మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే వారికి వైద్య పరీక్షలు జరిపించగా వారిలో ముగ్గురు మాదక ద్రవ్యాలు (కొకైన్) తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఎన్‌డీపీఎస్ యాక్ట్, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 కింద రాజ్‌ పాకాలపై కేసు నమోదు చేశారు. 

రేవ్‌ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది యువతులు పాల్గొన్నట్లు సమాచారం. పురుషులలో పలువురు ప్రముఖులే అని వేరే చెప్పక్కరలేదు. దీనిపై కాంగ్రెస్‌, బీజేపీలు ఏవిదంగా స్పందిస్తాయో ఊహించుకోవచ్చు కానీ కేసీఆర్‌ విదంగా స్పందిస్తారో?

Related Post