నాగార్జున వాంగ్మూలంలో ఏమని చెప్పారంటే...

October 08, 2024
img

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై నటుడు అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందిస్తూ క్రిమినల్ కేసు, పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు ఆదేశం మేరకు అక్కినేని నాగార్జున తన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సోదరి నాగ సుశీల, మేనకోడలు సుప్రియ యార్లగడ్డలతో కలిసి నాంపల్లి కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. కోర్టు దానిని రికార్డ్ చేసింది.

అక్కినేని నాగార్జున తన వాంగ్మూలంలో ఏమి చెప్పారంటే, “మా కుటుంబం దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. మా సినిమాల వలన మేము అనేక అవార్డులు అందుకున్నాము. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వలన సమాజంలో మాకు చాలా గౌరవమర్యాదలున్నాయి. 

కానీ మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ తన పరిధి దాటి రాజకీయ దురుదేశ్యంతో మా కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా చాలా అనుచితంగా మాట్లాడారు. ఎంతో గౌరవప్రదంగా జీవించే మేమందరం ఆమె అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపద్దాము. కనుక ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుని అభ్యర్ధిస్తున్నాము, అని వాంగ్మూలం ఇచ్చారు. కోర్టు సిబ్బంది దానిని రికార్డ్ చేశారు. 

దీనికి సాక్షులుగా నాగార్జున మేనకోడలు సుప్రియా యార్లగడ్డ తదితరులు సంతకాలు చేశారు. ఈ వాంగ్మూలం ఆధారంగా న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకి నోటీసులు జారీ చేసి ఆమె వివరణ కూడా తీసుకున్నాక విచారణ జరుపుతుంది. 

ఈ విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని అక్కినేని నాగార్జున తేల్చి చెప్పేశారు కనుక మంత్రి కొండా సురేఖ కూడా న్యాయపోరాటం చేయకతప్పదు. లేదా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదా సిఎం రేవంత్‌ రెడ్డి లేదా మరెవరి ద్వారానైనా అక్కినేని కుటుంబంతో మాట్లాడించి ఒప్పించి కోర్టు బయట రాజీకి ప్రయత్నించాల్సి ఉంటుంది. 

Related Post