నేటి నుంచే బతుకమ్మ పండుగ

October 02, 2024
img

తెలంగాణ మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజులపాటు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ నేటి నుంచి మొదలవుతుంది. తొలిరోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించబోతోంది.  

ఈ నెల 10వ తేదీన సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలలో 1,000 బతుకమ్మలతో వెయ్యి మంది జానపద, గిరిజన కళాకారులతో అమరవీరుల స్తూపం వద్ద కళా ప్రదర్శనలు, బతుకమ్మ ఆట పాటలు నిర్వహించనుంది.

ఆ రోజు సాయంత్రం 7 గంటలకు సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు తదితరుల సమక్షంలో ట్యాంక్ బండ్‌ మీద బతుకమ్మ పూజ, కళా ప్రదర్శన, నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు రవీంద్ర భారతిలో సాగే సంస్కృతిక ప్రదర్శన వివరాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలు: 

          


Related Post