కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అపోలో ఆస్పత్రి వైద్యులు స్టంట్ వేశారు. ఆయన గుండెలో రక్తం సరఫరా అయ్యే ఒక నరం పూడుకుపోయిన్నట్లు గుర్తించిన వైద్యులు ఈరోజు ఉదయం ఆయనకు స్టంట్ అమర్చారు. స్టంట్ అమర్చిన తర్వాత రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెల్లగా కోలుకొంటున్నారని తెలియజేస్తూ బులెటిన్ విడుదల చేశారు.
రజినీకాంత్ భార్య లత కూడా స్పందిస్తూ, తన భర్త త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారని తెలిపారు. తన భర్త ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. రజినీకాంత్ అత్యవసరం ఆస్పత్రిలో చేరిన్నట్లు తెలియగానే తమిళనాడులో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అపోలో ఆస్పత్రి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రజినీకాంత్ నటించిన తమిళ సినిమా వెట్టాయన్ సినిమా (తెలుగులో అదే పేరుతో) ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది.