జయం రవితో అటువంటి సంబంధం లేదు: కెనిషా ఫ్రాన్సిస్

September 29, 2024
img

కోలీవుడ్‌ నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అతను బెంగళూరుకి చెందిన కెనిషా ఫ్రాన్సిస్ అనే యువతితో వైవాహికేతర సంబంధం కలిగి ఉన్నందునే భార్య నించు విడిపోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వాటిపై ఆమె స్పందిస్తూ, “జయం రవి నాకు ఓ స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమే. అతనితో నాకు శారీరిక సంబంధం లేదు. కనుక ఆయన విడాకుల వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడం వెనుక నేనున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని నేను ఖండిస్తున్నాను.

అసలు జయం రవి వ్యవహారంలోకి నా పేరు ఎందుకు వస్తోందో నాకు అర్దంకావడం లేదు. వారి సొంత వ్యవహారంలోకి నన్ను లాగవద్దని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కెనిషా ఫ్రాన్సిస్ అన్నారు. 

జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్ద కుమారుడుకి జయం రవి తాము విడిపోతున్నట్లు చెప్పారు. తన కొడుకు తనని అర్దం చేసుకున్నాడు కానీ ఇన్నేళ్ళు కాపురం చేసిన భార్య అర్దం చేసుకోలేదని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Post