టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నేడు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఆయన భార్య సుమలత.
ఆమె ఫిలిమ్ ఛాంబర్ పెద్దలను కలిసి ఈ కేసులో బాధితురాలిపై ఫిర్యాదు చేశారు. తన భర్త నిందితుడు కాదని బాధితుడని ఆమె చెప్పారు. ముంబై నుంచి వచ్చి తన భర్త బృందంలో చేరిన ఆమె (బాధితురాలు) తన భర్తని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధిస్తుండేదని సుమలత ఫిర్యాదు చేశారు. తన భర్తని ఇంటికి వెళ్ళనీయకుండా అడ్డుకునేదని, దాదాపు 5 ఏళ్ళుగా తాను ఈ వేధింపులు భరిస్తున్నానని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని సుమలత చెప్పారు.
ప్రేమ పేరుతో ఆమె తన భర్తని వేధించడం భరించలేక తాను డైవోర్స్ ఇచ్చేసేందుకు సిద్దపడ్డానని కానీ ఆమె జానీ మాస్టర్, నేను తనకి అన్నావదినలవంటి వారమని మేమంటే చాలా గౌరవమని నాటకం ఆడేదని సుమలత చెప్పారు. ఆమెకు తన భర్తతోనే కాక ఇండస్ట్రీలో ఇంకా చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని సుమలత సంచలన ఆరోపణ చేశారు.
ఈవిషయం తెలిసినప్పటి నుంచే జానీ మాస్టర్ ఆమెను దూరం పెట్టారని అందుకు ఆయనపై కక్ష కట్టి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని అక్రమ కేసు పెట్టిందని సుమలత తెలిపారు. ఆమె (బాధితురాలు) తల్లి కూడా అటువంటిదే అని తల్లీకూతుర్లు ఇద్దరూ పేరున్న ప్రముఖులను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటారని సుమలత ఫిర్యాదు చేశారు. కనుక ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జానీ మాస్టర్‌పై ఆమె కేసు నమోదు చేయగానే సుమలత ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియజేసి ఉంటే వారు ఆ కోణంలో కూడా విచారణ జరిపేవారు. కానీ ఇన్ని రోజులు మౌనంగా ఊరుకొని ఇప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఫిలిమ్ ఛాంబర్ పెద్దలకు ఫిర్యాదు చేస్తుండటమే అనుమానాస్పదంగా ఉంది కదా?