ఖైరతాబాద్‌ సప్తముఖ గణపతిని చూశారా?

September 07, 2024
img

ఖైరతాబాద్‌ గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈసారి గణేశ్ విగ్రహం తయారీలో ప్రతీదీ ఏడు ఉండేలా తయారు చేశారు. విగ్రహంలో గణేశుడి తలకు ఇరువైపు ఆరు శక్తిస్వరూపాల శిరసులని కలిపి ఏడు శిరస్సులతో పైన ఏడు పడగలతో నాగరాజుని ఏర్పాటు చేశారు. గణేశ్ విగ్రహానికి చెరోవైపు ఏడు చొప్పున 14 చేతులు అమర్చారు. గణేశ్ విగ్రహం వెడల్పు 28 (7x4) అడుగులు, ఎత్తు 70 అడుగులు  ఉండేలా చాలా సుందరంగా తయారు చేశారు. 

మరికొద్ది సేపటిలో సిఎం రేవంత్‌ రెడ్డి దంపతులు లేదా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు వచ్చి వినాయకపూజ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.       


Related Post