వేణుస్వామికి మంచు విష్ణు వార్నింగ్?

August 13, 2024
img

సెలబ్రేటీల జాతకాల పేరుతో బాగా పాపులర్ అయిన వేణుస్వామి ఏపీ శాసనసభ ఎన్నికల గురించి చెప్పిన జోస్యం ఫలించకపోగా నవ్వుల పాలయ్యారు. తన అంచనాలు తప్పాయని కనుక ఇకపై జాతకాలు చెప్పనన్నారు. కానీ మళ్ళీ మొన్న నాగ చైతన్య-శోభిత ధూళిపాళల జాతకాలు చూసి, వారు మూడేళ్ళ కంటే కలిసి ఉండలేరని, ఓ స్త్రీ వలన వారు విడిపోతారని జోస్యం చెప్పారు. 

వారు శుభమా అని పెళ్ళి చేసుకోబోతుంటే వేణుస్వామి విడిపోతారంటూ చెప్పినందుకు ఆయనపై నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ఈవిషయం తెలియడంతో వేణుస్వామికి ఫోన్ చేసి చివాట్లు పెట్టిన్నట్లు తెలుస్తోంది. జాతకాల పేరుతో ప్రముఖుల ప్రైవసీకి ఇబ్బంది కలిగించితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. పోలీస్ కేసు కూడా పెడతామని హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది. 

అయితే తాను గతంలో నాగ చైతన్య-సమంతల జాతకాలు చెప్పానని ఆ ప్రకారమే వారు విడిపోయారని, ఇప్పుడు నాగ చైతన్య మళ్ళీ శోభిత ధూళిపాళతో వివాహానికి సిద్దపడుతుండటంతో కేవలం ఆసక్తితో వారిరువూరు జాతకాలు పరిశీలించి వారి భవిష్యత్‌ ఏవిదంగా ఉంటుందో చెప్పాను తప్ప మరే దురుదేశ్యం లేదని వేణుస్వామి సంజాయిషీ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. 

Related Post