రాజ్‌తరుణ్‌-లావణ్య కేసుపై వర్మ విశ్లేషణ అదుర్స్!

August 11, 2024
img

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసు గురించి అన్ని విషయాలు మాట్లాడేయడం పూర్తయిపోయింది. కనుక ఇక కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదని అందరూ భావిస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఈ వ్యవహారాన్ని విశ్లేషించారు.

ఈరోజుల్లో శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకున్నవారే కొన్నేళ్ళు కాపురం చేసిన తర్వాత విడిపోతున్నారు. కనుక 11 ఏళ్ళు సహజీవనం చేసినంత మాత్రాన్న విడిపోకూడదనేమీ లేదు. రాజ్‌తరుణ్‌ ఏ కారణంతో లావణ్యకు దూరమైనప్పటికీ అతనే నాకు కావాలని లావణ్య అడగడం చిన్న పిల్లాడు చాక్లెట్ కోడం మారాం చేసిన్నట్లే ఉంది.

పైగా వారు అన్యోన్యంగా సంసారం చేస్తున్నప్పుడే లావణ్య అతని సంభాషణలను తన ఫోన్లో రికార్డ్ చేస్తుండటం ఆమెది క్రిమినల్ మెంటాలిటీ అని స్పష్టం చేస్తోంది. అ ఫోన్ సంభాషణలు మీడియాకు లీక్ చేయడం కూడా అదే సూచిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ రాజ్‌తరుణ్‌ ఆమెతో ఇక ఎన్నటికీ కాపురం చేసే అవకాశం లేదు. కనుక అతనితో కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని పరిష్కరించుకోవడం మంచిది. అది కోర్టు బయటా లోపలా అనేది వారిష్టం. కానీ చివరికి ఈ వ్యవహారం డబ్బుతోనే సెటిల్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను,” అని రాంగోపాల్ వర్మ అన్నారు.

Related Post