మాది సహజీవనం కాదు లైంగిక సంబంధం మాత్రమే!

August 10, 2024
img

దువ్వాడ జగన్నాధం అంటే అల్లు అర్జున్‌ సినిమా అని అందరికీ తెలుసు కానీ దువ్వాడ శ్రీనివాస్ అంటే తెలంగాణ బహుశః ఎవరికీ తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. 

రాజకీయాలలో ఉన్న అటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ టెక్కలి వైసీపికి చెందిన డి. మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. విశేషమేమిటంటే, ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దువ్వాడ శ్రీను, ఆమె ఇద్దరూ తమ కుటుంబాలను విడిచిపెట్టి టెక్కలి సమీపంలో వేరే ఇంట్లో కాపురం పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా వైసీపిలోనే జెడ్పీటీసీగా ఉన్నారు. 

శుక్రవారం సాయంత్రం ఆమె తన ఇద్దరు కుమార్తెలను వెంటపెట్టుకొని అక్కవరంలో వారు ఉంటున్న ఇంటికి వెళ్ళి వారిని నిలదీశారు. అయితే ఈ పరిణామాలతో సిగ్గుతో తలదించుకోవలసిన దువ్వాడ శ్రీనివాస్‌, భార్యాపిల్లలను బూతులు తిడుతూ వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలమని చెపుతూ రాత్రి 2 గంటల వరకు వారు అక్కడే ఇంటి ముందు ధర్నా చేశారు. 

ఈ పరిణామాలపై డి. మాధురి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, “యస్. ఆయనకు, నాకు కుటుంబాలు ఉన్నాయి. ఆయన ఇంకా తన భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. నేను కూడా మా ఆయన నుంచి విడాకులు తీసుకోలేదు. మేము పెళ్ళి చేసుకుంటే ఇల్లీగల్ అవుతుంది కనుకనే మేమిద్దరం పెళ్ళి చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. 

ఆయన నాకు ఓ స్నేహితుడుగా, మార్గదర్శిగా నాకు అండగా ఉంటున్నారు. ఆయన నన్ను ఉంచుకొని కాపాడుతున్నారు. మేము సహజీవనం చేయడం లేదు. మాది ఆడల్టరీ (వివాహితులు ఇతరులతో ఇచ్చాపూర్వకంగా లైంగిక సంబంధం కలిగి ఉండటం). మేము ఏ తప్పు చేయలేదు. ముఖ్యంగా నేను శ్రీను గారి కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. కనుక ఆయన భార్యకి ఏమైనా సమస్యలుంటే తన భర్తతోనే తేల్చుకుంటే మంచిది,” అని అన్నారు.           

Related Post