బ్రెజిల్ దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విమాన సిబ్బందితో పాటు 58 మంది ప్రయాణికులు మృతి చెందారు.
వోపాస్ లిన్హాస్ ఏరియాస్ అనే విమానయాన సంస్థకు చెందిన విమానం బ్రెజిల్ దేశంలోని కాస్కవెల్ విమానాశ్రయం నుంచి స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2.56 గంటలకు బయలుదేరింది.
బ్రెజిల్ దేశంలోనే సావొ పౌలో-గౌరాల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని సమీపిస్తుండగా సాయంత్రం 4.22 గంటలకు విన్‌హెడో అనే ప్రాంతంలో విమానం అదుపు తప్పిన్నట్లు గాలిలో గుండ్రంగా తిరుగుతూ కింద నివాస్ ప్రాంతాలపై కూలిపోయింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ విమానంలో ఉన్నవారిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బ్రతికి బయటపడలేదు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.