ప్రముఖ జ్యోతిష్యుడు వేణూ స్వామి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న నాగ చైతన్య-శోభిత దూళిపాళల జాతకాల గురించి మాట్లాడారు.
“నాగ చైతన్య, సమంతల జాతకాల ప్రకారం వారికి నేను 50 మార్కులు వేశాను. కానీ నాగ చైతన్య-శోభిత దూళిపాళల జాతకాల ప్రకారం వారికి 10 మార్కులు మాత్రమే వేశాను. 50 మార్కులు పొందిన నాగ చైతన్య-సమంతలే విడిపోయినప్పుడు, కేవలం 10 మార్కులు మాత్రమే పొందిన నాగ చైతన్య-శోభిత దూళిపాళలు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని వేణుస్వామి చెప్పారు.
ఓ పరాయి స్త్రీ మూలంగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ విడిపోయే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పారు. అయితే అలా జరుగకూడదని, నా జాతకం తప్పుకావాని కోరుకుంటున్నాను,” అని వేణుస్వామి అన్నారు.
సమంత, శోభిత దూళిపాళ సినీ కెరీర్‌పై కూడా వేణుస్వామి తన అంచనాలు తెలిపారు. సమంత జాతకం ప్రకారం ఆమె కెరీర్ 100% బాగుందని కానీ శోభిత దూళిపాళ కెరీర్ 20% మాత్రమే బాగుందని వేణుస్వామి చెప్పారు.