రాజ్‌తరుణ్‌కు ఇక అరెస్ట్ భయం లేదు కానీ...

August 09, 2024
img

తెలుగు సినీ నటుడు రాజ్‌తరుణ్‌కి హైకోర్టు ఉపశమనం కల్పించింది. అతనికి రూ.20 వేల సొంత పూచీకత్తుతో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తనతో 11 ఏళ్ళు సహజీవనం చేసిన రాజ్‌తరుణ్‌ మాల్వీ మల్హోత్రా అనే నటితో ప్రేమాయణం మొదలుపెట్టాక తనను విడిచిపెట్టిపోయాడని అతని మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

అతని వలన తాను గర్భం దాల్చితే అబార్షన్ చేయించాడని, శారీరికంగా తనను వాడుకున్న రాజ్‌తరుణ్‌ ఇప్పుడు వేరే అమ్మాయితో  తిరుగుతూ తనను మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేసింది. ఆమె తన వాదనలకు మద్దతుగా అన్ని సాక్ష్యాధారాలు పోలీసులకు సమర్పించింది. కనుక నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ నోటీస్‌ పంపారు. 

కానీ రాజ్‌తరుణ్‌ తన సినిమాలతో బిజీగా ఉన్నానని చెపుతూ విచారణకు హాజరుకాలేదు. ఈలోగా హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ సంపాదించుకున్నాడు. కనుక ఈ కేసులో పోలీసులు రాజ్‌తరుణ్‌ని అరెస్ట్ చేయలేరు. కానీ అంతమాత్రన్న చీటింగ్ కేసు ముగిసిపోదు. 

అతను లావణ్యని మోసం చేశాడని సాక్ష్యాధారాలు ఉన్నందున వాటిని కోర్టుకి సమర్పిస్తారు. అప్పుడు అతను కోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. కానీ ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు సాగదీసుకుంటూ కొన్ని నెలలు లేదా ఏళ్ళు శిక్ష తప్పించుకునే అవకాశం ఉంది.

Related Post