నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధం... ఫోటో

August 08, 2024
img

నేడు హైదరాబాద్‌లో నాగ చైతన్య, శోభిత దూళిపాళల వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయం నాగార్జున స్వయంగా తెలియజేస్తూ వారి ఫోటోని కూడా సోషల్ మీడియాలో పెట్టారు.

తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ, “ఈరోజు ఉదయం 9.42 గంటలకు నా కుమారుడు నాగ చైతన్య, శోభిత దూళిపాళతో వివాహ నిశ్చితార్ధం జరిగిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. ఆమెను మా కుటుంబంలోకి వస్తునందుకు చాలా సంతోషంగా ఉన్నాము. కాబోయే నూతన దంపతులకు శుభాకాంక్షలు. వారిరువురూ జీవితాంతం ప్రేమగా, సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు ఆరంభం,” అని ట్వీట్‌ చేశారు. 

ఈ శుభవార్త విని అభిమానులు నాగ చైతన్య, శోభితలకు అభినందనలు తెలియజేస్తున్నారు. నాగ చైతన్య మాజీ భార్య సమంత స్పందిస్తారా లేదా? స్పందిస్తే ఏవిదంగా? అనేది ఆసక్తికరం. 

Related Post