కేరళకు ప్రభాస్‌ భారీ విరాళం

August 07, 2024
img

ప్రభాస్‌ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కనుక ఆయనకు దేశంలో అన్ని రాష్ట్రాలలో అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా కల్కి ఎడి2898 విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్‌ అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.

కేరళలో కూడా ప్రభాస్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కనుక కేరళలోని వయనాడ్ వరద విపత్తులో బాధితులకు సాయపడేందుకు ప్రభాస్‌ రూ.2 కోట్లు కేరళ ముఖ్యమంత్రి నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన మేనేజర్ ప్రకటించారు. దీనిపై ప్రభాస్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా ప్రభాస్‌ రూ.2 కోట్లు ఇవ్వగా, చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రముఖ మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లు ఆర్ధికసాయం అందించారు. స్వయంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు కూడా. 

అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, నయనతారా, విగ్నేష్‌ దంపతులు రూ.20 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ ముగ్గురూ కలిసి రూ.50 లక్షలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక మందన్ రూ.10 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు విరాళాలు ఇచ్చారు.    


Related Post