ప్రకృతి విపత్తుకు సర్వం కోల్పోయిన కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి నిధికి భారీ విరాళాలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
అల్లు అర్జున్ రూ.25 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు, నయనతార-విగ్నేష్ దంపతులు రూ.20 లక్షలు, విక్రమ్ రూ. 20 లక్షలు, కమల్ హాసన్ రూ.10 లక్షలు విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కోలీవుడ్ నటులు సూర్య-జ్యోతిక దంపతులు, సూర్య సోదరుడు కార్తీ ముగ్గురూ కలిసి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు.
మలయాళ నటులు మామ్ముట్టీ ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు ఇవ్వగా మరో మలయాళ నటుడు మోహన్ లాల్ భారీ విరాళంతో స్వయంగా మిలట్రీ యూనిఫారం ధరించి సహాయ చర్యలలో పాల్గొన్నారు.