కేరళకు చిరంజీవి భారీ విరాళం

August 04, 2024
img

కేరళ రాష్ట్రంలో వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విపత్తులో సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది ఆచూకీ ఇంకా తెలియవలసి ఉంది. కొండ చరియలు విరిగిపడటంతో వాటి కింద నలిగి చనిపోయినవారు కొందరు కాగా వరదలో కొట్టుకుపోయిన మనుషులు, చిన్నారులు, పశువులు ఎన్నో లెక్కే లేదు.

కేరళకు వచ్చిన ఈ కష్టానికి వివిద రంగాలకు చెడిన ప్రముఖులు భారీ విరాళాలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి నిధికి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

“కేరళలో జరిగిన ప్రకృతి విపత్తులో వందల మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. వయనాడ్ బాధితులకు సంతాపం తెలియజేస్తూ, వారి కోసం నేను నా కుమారుడు రామ్ చరణ్‌ కలిగి కేరళ ముఖ్యమంత్రి నిధికి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నాము. వయనాడ్ బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను,” అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

Related Post