ప్రముఖ నటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయడంతో విచారణకు హాజరు కావలసి ఉంది. కనుక రాజ్‌తరుణ్ నేడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు.
హైకోర్టు అతని పిటిషన్ విచారణకు స్వీకరించి నార్సింగి పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం)వాయిదా వేసింది.
రాజ్‌తరుణ్ తనతో పదేళ్ళు కాపురం చేసి, శారీరికంగా వాడుకొని అబార్షన్ కూడా చేయించాడని, అతను నటించిన ‘తిరగబడరా సామి’ సినిమాలో హీరోయిన్ మాల్యా మల్హోత్రాతో ప్రేమాయణం మొదలుపెట్టాక తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడంటూ అతని మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆమె సాక్ష్యాధారాలు కూడా సమర్పించడంతో పోలీసులు రాజ్‌తరుణ్, మాల్యా మల్హోత్రలపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావలని నోటీసు పంపారు.
కానీ పురుషోత్తముడు, ‘తిరగబడరా సామి రెండు సినిమాల విడుదలతో బిజీగా ఉన్నందున కొంత సమయం కోరారు. కనుక నేడు కాకపోతే రేపు అయినా విచారణకు హాజరు కాక తప్పదు. విచారణకు హాజరైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
కనుక రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయక తప్పలేదు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించగలదేమో కానీ ఈ కేసు నుంచి విముక్తి కల్పించలేదు. కనుక రాజ్‌తరుణ్ లావణ్యతో ఏదో విదంగా రాజీ పడక తప్పకపోవచ్చు.