రాజ్‌తరుణ్, మాల్యా మల్హోత్రా జంటగా చేసిన తిరగబడరా సామి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగినప్పుడు, రాజ్‌తరుణ్ లవర్ లావణ్య అక్కడికి బయలుదేరింది. అయితే రాజ్‌తరుణ్ ముందే ఈ విషయం పసిగట్టడంతో బౌన్సర్లను పెట్టుకొని హడావుడిగా ఆ కార్యక్రమం ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కానీ లావణ్య మాత్రం అతనిని విడిచిపెట్టలేదు. నేరుగా మాదాపూర్‌లోని రాజ్‌తరుణ్ ఇంటికి వెళ్ళి అతనిని కలిసేందుకు ప్రయత్నించింది. రాజ్‌తరుణ్ అడిగిన సాక్ష్యాధారాలన్నీ తీసుకువచ్చానని, అతనితో మాట్లాడాలని వచ్చానని చెప్పినా తలుపులు తీయలేదు. దాంతో ఆమె అతని ఇంటి ముందే కొంతసేపు నిరసన దీక్ష చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
రాజ్‌తరుణ్ సినీ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో పురుషోత్తముడు, తిరగబడరా సామి రెండు సినిమాలు విడుదలవుతుంటే, ఈ వ్యవహారం బయటపడటం, పోలీస్ కేసు నమోదు అవడం అతనికి, దర్శక నిర్మాతలకి కూడా చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు.
ఇటీవల రిలీజ్ అయిన పురుషోత్తముడు సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు రెండో సినిమాపై విడుదలకు ముందు ఈవిదంగా జరుగుతుండటంతో దానిపై ప్రభావం పడుతుందేమో అని దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
రాజ్‌తరుణ్, మాల్యా మల్హోత్రాలకి పోలీసులు నోటీస్ జారీ చేయగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నందున హాజరు కాలేమని లాయర్ ద్వారా జవాబు పంపారు. కానీ ఆగస్ట్ 2న సినిమా విడుదలైన తర్వాత విచారణకు హాజరుకాక తప్పదు. కనుక రాజ్‌తరుణ్-లావణ్య-మాల్యా మల్హోత్రా వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో... ఏవిదంగా ఎప్పటికీ ముగుస్తుందో?
రాజ్ తరుణ్ ఇంటి వద్ద లావణ్య ఆందోళన
— ChotaNews (@ChotaNewsTelugu) July 31, 2024
హైదరాబాద్ మాదాపూర్‌లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్‌తో మాట్లాడటానికి వచ్చానని,తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్లనని అన్నారు. 'తిరగబడర సామీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయారని… pic.twitter.com/AR4JPRvCgo