సోమవారం సాయంత్రం ఫలహారం బండ్ల ప్రదర్శనతో హైదరాబాద్‌లో బోనాల పండుగ పండగ ముగిసింది. నిన్న చివరిరోజు కావడంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం, వడి బియ్యం, చీరసారెలు సమర్పించుకునేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం స్వర్ణలత భవిష్యవాణి రంగం కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఎదుట పచ్చికుండపై నిలబడి భక్తులు అడిగిన ప్రశ్నలకు స్వర్ణలత సమాధానాలు చెప్పారు.
తాను భక్తుల పూజలతో సంతృప్తి చెందానని చెప్పారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పంటలు బాగా పండుతాయని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని చెప్పారు. తనకు భక్తులు భక్తితో ఏది సమర్పిస్తే దానినే సంతోషంగా స్వీకరించి చల్లగా చూస్తానని చెప్పారు.
భక్తి ముఖ్యం కానీ భక్తులందరూ తనకు సమానమే అని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు, ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతానని చెప్పారు. అలాగే పశుపక్ష్యాదులను కూడా తాను కాపాడుతానని చెప్పారు. పంటలకు (పురుగుల) మందులు చల్లడం మానుకోవాలని, వాటితో ప్రజలు రోగాల పాలవుతున్నారని చెప్పారు.
నా రూపాన్ని పెట్టాలనుకుంటున్నారు కదా... తప్పకుండా పెట్టండి... నా రూపాన్ని నేనే కాపాడుకుంటానని అమ్మవారు పూనిన స్వర్ణలత చెప్పారు.