మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజ్నోవా

July 21, 2024
img

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సతీమణి అన్నా లెజ్నోవా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి నిన్న మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. శనివారం జరిగిన స్నాతకోత్సవంలో యూనివర్సిటీ అధికారులు ఆమెకు మాస్టర్స్ డిగ్రీ ప్రధానం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆమెతో పాటు సింగపూర్ వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇంతకు ముందు ఆమె థాయ్‌ల్యాండ్‌ చరిత్ర, ఆసియాదేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై బ్యాంకాక్‌లోని చులాలంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి తొలి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఇప్పుడు సింగపూర్ యూనివర్సిటీ నుంచి ‘ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం’లో మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తన భార్య అన్నా లెజ్నోవా మాస్టర్స్ డిగ్రీ అందుకున్న తర్వాత ఆమెను అభినందించి, ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులతో పంచుకున్నారు.

Related Post