శ్రీవారి భక్తులకు టిటిడి విజ్ఞప్తి

June 22, 2024
img

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిటిడిని సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారు. ముందుగా టీటీడీ ఈవోని మార్చేశారు. త్వరలో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్‌ ధరను రూ.300 నుంచి రూ.200కి తగ్గించారని, ప్రస్తుతం రూ.50 ఉన్న లడ్డూ ప్రసాదం ధరను రూ.20కి తగ్గించారంటూ వార్తలు వస్తున్నాయి. 

వాటిపై టీటీడీ స్పందిస్తూ, వాటి ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. కనుక తాము స్వయంగా ప్రకటిస్తే తప్ప సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి మోసపోవద్దని సూచించింది.

ముఖ్యంగా ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ వంటి టికెట్స్ ఇప్పిస్తామంటూ వాట్సప్ గ్రూపులలో కొందరు దళారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా కౌంటర్లలో మాత్రమే అన్ని రకాల సేవలు, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో కొన్ని సేవలు అందుబాటులో ఉంచామని స్పష్టం చేసింది. 

Related Post