కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య!

June 21, 2024
img

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా, చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని  ఆల్వాల్‌లోని పంచశీల కాలనీలోని తమ నివాసంలో ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆమె వికారాబాద్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. రూపాదేవి రెండు రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నారు. 

గురువారం ఉదయం భర్త మేడిపల్లి సత్యం నియోజకవర్గం పర్యటనకు వెళ్ళారు. ఇంట్లో ఆమె ఒక్కర్తే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకున్నారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం గత కొంతకాలంగా భార్యభర్తల మద్య మనస్పర్ధలు నెలకొన్నాయి. బహుశః ఆ కారణం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Related Post